TRINETHRAM NEWS

The Congress government has not increased the pension for disabled persons of Vikarabad district for 9 months

Trinethram News : కాంగ్రెస్ ప్రభుత్వంలో వికలాంగులకు రక్షణ కరువైంది కాళ్ళ జంగయ్య ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల గెస్ట్ హౌస్ లో, వికలాంగుల హక్కుల పోరాట సమితి వికారాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది, ముఖ్య అతిథిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కాళ్ల జంగయ్య పాల్గొని మాట్లాడుతూ, వికలాంగులకు తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని తెలిపారు, మొన్నటికి మొన్న ఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వికలాంగులను అవహేళన చేస్తే ప్రభుత్వం ఆమెపై ఎటువంటి చర్య తీసుకోలేదు, ఆమె మీద చర్యలు తీసుకోవాలని అన్ని వికలాంగుల సంఘాలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా కాలేదు,

ఆమెను ప్రభుత్వమే వెనకేసుకొస్తుంది అనీ అనుమానం వ్యక్తం అవుతుంది, హైదరాబాద్ నడిబొడ్డున మలక్పేట్ లో గల అంద విద్యార్థికి అత్యాచారం జరిగితే ఇప్పటివరకు బాధితురాలికి అసలు అత్యాచారమే జరగనట్టు మంత్రి సీతక్క మాట్లాడడం వెనుక వికలాంగులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది హైదరాబాదులో హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున ఇళ్లు కూల్చివేత కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈ విషయంలో గత 20 సంవత్సరాల క్రింద,ఇండ్ల స్థలాలు ప్రభుత్వమే ఇచ్చిన సంగతి మర్చిపోయి, ఇప్పుడు కూల్చివేయడం ఎంతవరకు సమంజసం అని హెచ్చరించారు,

అదే క్రమంలో వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు చేనేత కార్మికులకు కల్లుగీత కార్మికులకు పెన్షన్లు పెంచుతామని చెప్పి, 9 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు పెన్షన్ల ఊసే ఎత్తని ఈ రేవంత్ రెడ్డి సర్కార్, తక్షణమే వికలాంగుల సమస్యల మీద దృష్టి పెట్టి పరిష్కారమయ్యే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు, లేదంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ, నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు శాంప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమతి రాజు, ఆకుల సంజీవ, తది తరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The Congress government has not increased the pension for disabled persons of Vikarabad district for 9 months