MLA Adireddy : మాట నిలబెట్టుకునేదే కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

సిఎం చంద్రబాబు చిత్రపటానికి నాయీ బ్రాహ్మణుల పాలాభిషేకం
అన్ని వర్గాలకు సంతృప్తికరమైన పాలన: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

త్రినేత్రం న్యూస్. రాజమహేంద్రవరం, ఆగష్టు 12: ఎన్నికల సమయంలో నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నాయి బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లును ఉచితం చేస్తూ మాట నిలబెట్టుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆయన ఆలోచన విధానంతో అన్ని వర్గాలకు సంతృప్తికరమైన పాలన అందిస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తును పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సాధికారిక సమితి- రాజమహేంద్రవరం సిటి నాయి బ్రాహ్మణుల సంఘీయుల ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొని పాదాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. నాయీ బ్రాహ్మణుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తున్నారని, నాయీ బ్రాహ్మణులు కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్,తెలుగు యువత నగర కార్యదర్శి కందికొండ అనంత్,సాధికారిక సమితి నగర అధ్యక్షుడు అలజంగి దేవుడు మాట్లాడుతూ తొలి నుంచి నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేసేది చంద్రబాబు నాయుడు ఒక్కరేనని, కూటమి ప్రభుత్వంలో కూడా ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు పెంచి తమ జీవితాలను వెలుగులతో నింపుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు తాడి దుర్గాప్రసాద్,నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి నాయకులు కోటిపల్లి చంద్రశేఖర్, పెండ్యాల నాగేశ్వరరావు, కోరిపల్లి నాగేశ్వరరావు, బలగం కిరణ్, జామి ప్రసాద్,పాతర్లపల్లి సురేష్, రాజన్న సత్తిరాజు, కరాసి శ్రీను, చిట్టాబత్తుల వరబాబు, ముక్కాల సందీప్, యానాపు మధు, ఇనపగుత్తి ఈశ్వరరావు, రాలి పైడ్రాజు, రాలి సత్తిరాజు,అప్పలరాజు, విజయ శేఖర్ పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

coalition government keeps its word

You cannot copy content of this page

Scroll to Top