WhatsApp Image 2024 08 07 at 18.36.18
The coalition government is targeting us
Trinethram News : వారికి సంబంధించిన పత్రికల్లో అవాస్తవాలు ప్రచురిస్తున్నారు
మాలాంటి వల్ల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు
మదనపల్లి లో రికార్డులు తగలబడ్డాయని అంటున్నారు
అదికూడా మేమే చేశామని ఆరోపిస్తున్నారు
మా మీద కొందరు నిరాధారా ఆరోపణలు చేస్తున్నారు
మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమను టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కేవలం వారికి సంబంధించిన పత్రికల్లో అవాస్తవాలు ప్రచురించి ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బుధవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “మాలాంటి వల్ల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మదనపల్లి లో రికార్డులు తగలబడ్డాయని అంటున్నారు.
అదికూడా మేమే చేశామని ఆరోపిస్తున్నారు. ఒక వేళ ఆ రికార్డులు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాయి. మా మీద కొందరు నిరాధారా ఆరోపణలు చేస్తున్నారు. మా కుటుంబానికి తప్పు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు మా పై నమ్మకం ఉంది కాబట్టే ఇన్ని సార్లు ప్రజలు గెలిపించారు. రాష్ర్టంలో ప్రస్తుతం హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. వారిపై పోలీసు అధికారులు దృష్టి పెడుతున్నారా..? ఎక్కడా కూడా రికార్డులు తగలబడితే హెలికాప్టర్లో వెళ్లి చూసిన రోజులు లేవు.” అని వ్యాఖ్యానించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
