
- వంపూరు గంగులయ్య*
జనసేన పార్టీ అరకు పార్లమెంట్ మరియు పాడేరు ఇన్చార్జి.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో జి.మాడుగుల , పాడేరు మండలాల ముఖ్య నాయకుల సమావేశంలో డా. గంగులయ్య మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక జనసేన పార్టీ సిద్ధాంతాలు, నిజాయితీ ,నిబద్ధతతో అంకితభావంతో పనిచేసే నాయకులను గుర్తించి బరి లో దించేందుకు ప్రణాళిక చేయాలని, ముఖ్య నాయకులకు అదేశించారు. కూటమి నాయకుల సమన్వయంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సంసిద్ధంగా వుండాలని,ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమీషన్ చైర్మన్ నీలం సాహ్ని స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించిన ప్రకటన చేశారని అన్నారు.
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మిత్రపక్షాల తో సమావేశం ఏర్పాటు ఉంటుందని, కాబట్టి ప్రతి ఒక్క జనసైనికుడు అధినేత ఆశయాలే లక్ష్యంగా పనిచేయాలనీ ఆశిస్తున్నమన్నారు.ఈ సమావేశంలో జి.మాడుగుల మండల అధ్యక్షులు మాసాడి భీమన్న,పాడేరు మండల అధ్యక్షులు నందోళి మురళీ కృష్ణ, సీనియర్ నాయకులు పాంఘి శివాజీ,బర్జ నాగేశ్వర్రావు, సోమేలి సోమరాజు,అశోక్,తదితర ముఖ్యనాయకులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
