
TGPSC Notification : త్రినేత్రం న్యూస్ : జూన్ 2, : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 290 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా రోడ్లు, భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులతో పాటు, కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కమిషన్ తెలిపింది. సివిల్ ఇంజినీర్ పోస్టులకు ఈ నెల 6 నుంచి జులై 13 వరకు, ఎలక్ట్రికల్ పోస్టులకు ఈ నెల 8 నుంచి జులై 15 వరకు, అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 10 నుంచి జులై 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి ఎం.హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం TGPSC అధికారిక వెబ్సైట్ సంప్రదించాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
