Telangana Formation Day : ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

TRINETHRAM NEWS

త్రినేత్రం చేవెళ్ల నియోజకవర్గం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చేవెళ్ల పట్టణంలోని PACS కార్యాలయం, AMC కార్యాలయం మరియు మునిసిపల్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య
అనంతరం మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుండి గుండం వరకి నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, గుండం వద్ద నిర్వహించిన సమావేశంలో. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, అమరవీరులకు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రతి ఇంటి నుండి తడిచెత్త, పొడి చెత్తను సేకరించడం, రాబోయే వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకొని నాళాలు డ్రైనేజీ పూడిక తీత పనులు, వనమహోత్సవ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం, హరిత వనాలు పెంచడం, దోమల నివారణకు మందు స్ప్రే చెయ్యాలని, ఇంకుడు గుంతల నిర్మాణం చేయాలన్నారు.
అనంతరం మున్సిపాలిటీ కార్మికులకు సన్మానం చేశారు. చేవెళ్ల నియోజకవర్గ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana Formation Day celebrated

You cannot copy content of this page

Scroll to Top