TRINETHRAM NEWS

మార్చి 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్‌ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 18 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఈ మేరకు సార్వత్రిక విద్యా పీఠం డైరెక్టర్‌ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు ఉంటాయన్నారు. ప్రాక్టికల్స్‌ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా కొనసాగుతాయన్నారు.

పరీక్ష ఫీజును జనవరి 5 నుంచి ఫిబ్రవరి 19వరకు ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చని తెలిపారు. ఇంటర్మీడియట్‌కు రూ.1000, పదో తరగతికి రూ.500తోపాటు సబ్జెక్టులకు నిర్దేశించిన పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.