Trinethram News : ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బొగత జలపాత సందర్శనను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఈ నెల 26 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ములుగు డీఎఫ్ఓ కిషన్ జాదవ్ తెలిపారు.
అటవీ ప్రాంతంలో భారీ వర్షపాతం కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతాపరంగా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. అంతేగాక, ముత్యందార, కొంగర, మామిడి లొద్ది, కృష్ణపురం జలపాతాలను శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏ విధమైన ప్రయాణాలు కూడా ఈ ప్రాంతాలకు మళ్లించవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారుల హెచ్చరికలను విస్మరించి వెళ్లే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


