దేవరకొండ డివిజన్ జనవరి 22 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం ముస్లిం మత పెద్ద ముఫ్తీ ఖాతేబ్ – ఏ – ఈదేన్ , ముఫ్తీ సయ్యద్ అంజద్అలీ ఖాస్మిని దేవరకొండ ఈద్గా కమిటీ ఎంపిక చేసింది. స్థానిక మక్కా మసీద్ లో జరిగిన ఈద్గా కమిటీ సమావేశంలో ప్రజల అధిష్టానం మేరకు ముఫ్తి సయ్యద్ అంజద్ అలీ ఖాస్మీ పేరును ఈద్గా కమిటీ అధ్యక్షులు ప్రతిపాదించారు.
దీంతో కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం పలికారు ప్రజల అదృష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. స్వర్గస్తులైన దేవరకొండ ముఫ్తి హజ్రత్ మహమ్మద్ జావేద్ హుస్సేన్ ఖస్మి రహమతుల్లా అలైహి యొక్క పూర్తి బాధ్యతలు సేవలు ఇకనుండి ముఫ్తి సయ్యద్ అంజాద్ అలీ ఖాస్మి నిర్వహిస్తారని పేర్కొన్నారు.
రంజాన్ బక్రీద్ పండుగ లవేల ఈద్గాలో జరిగే ప్రత్యేక ప్రార్థనలకు నూతన ముఫ్తి సారథ్యం వహిస్తారని తెలిపారు. అనంతరం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో నూతన ముప్ఠిని ఈద్గా కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు పూలమాలతో శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రహత్ అలీ గౌరవ అధ్యక్షులు షబ్బీర్ అహ్మద్ జావిద్ అలీ జనరల్ సెక్రెటరీ ఉపాధ్యక్షులు జాఫర్ ఖాన్ ఎండి షబ్బీర్ సెక్రెటరీ ఇలియాస్ బాబా జాయింట్ సెక్రెటరీలు కైసర్ అప్రోచ్ సహాయ కార్యదర్శిలు ముజీబ్ సయ్యద్ అజిజ్ సభ్యులు కుసురుతుల్ల సయ్యద్ దస్తగిరి ఎండి సలీం హమీద్ షకిల్ ఖాజా షఫీ మంజూర్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


