TRINETHRAM NEWS

Support RFCL job victims

ఉద్యోగాల పేరిట వసూలు చేసిన సొమ్మును 100% తిరిగి ఇవ్వాలి

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచే విధంగా జీవో నెంబర్ 22 గెజిట్ చేసి అమలు చేయాలి

డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క వినతిపత్రం ఇచ్చిన
CPI ML మాస్ లైన్ ప్రజా పంథా.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క CPI ML మాస్ లైన్ ప్రజా పంథా ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగ బాధితుల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 490 మంది బాధితులకు ఇంతవరకు న్యాయం జరిగిన పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పడ్డ అఖిలపక్ష కమిటీ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయింది. ఎంతమంది బాధితులు ఉన్నారు ఎంతమందికి ఎంత సొమ్మును పంచారనే విషయాన్ని ఇంతవరకు బహిరంగపరచలేదు.

కేవలం 45 శాతాన్ని ఇచ్చామంటూ చేతులు దులుపుకున్న పరిస్థితి కూడా ఉన్నది. ఇప్పటికే బాధితుల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఏ ఒక్క బాధితునికి కూడా 100% డబ్బులు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. ఆర్ ఎఫ్ సి ఎల్ నిరుద్యోగ ఉద్యోగ బాధితులంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలో ఎవరికీ చెప్పుకుంటే న్యాయం జరుగుతుందో అని ఎదురుచూస్తున్న పరిస్థితి ఉన్నది. మాయ మాటలు నమ్మి మోసపోయిన బాధితులంతా ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. బాధితులందరికీ 100% డబ్బులు తిరిగి ఇప్పిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని విశ్వాసంతో ఉన్న బాధితులకు న్యాయం జరగడం లేదు. ఇప్పటికైనా తమ స్పందించి ఉద్యోగ బాధితులకు 100% డబ్బులు తిరిగి ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు అదేవిధంగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. జీవో నెంబర్ 22 గెజిట్ కాకపోవడం మూలంగా అమలు కావడం లేదు. ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఉన్న సింగరేణి లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు మాత్రం ప్రైవేటు సంస్థల కంటే హీనంగా పొందుతున్న పరిస్థితి ఉన్నది.

ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉన్నది జీవో నెంబర్ 22 వెంటనే గెజిట్ చేసి సింగరేణిలో అమలుపరచాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో సీపీఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, జిల్లా కమిటీ సభ్యులు ఆడేపు శంకర్, పెండ్యాల రమేష్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Support RFCL job victims