Sai Baba’s Idol : సాయిబాబా విగ్రహాన్ని తాగిన సూర్యకిరణాలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, అనపర్తి :మే 25: అనపర్తి గ్రామంలోని సనాతన ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వేద పండితులు రెడ్డి సురేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాల రాజేశ్వరి పీఠంలో కొలువు తీరిన శ్రీ షిరిడి సాయినాధుని విగ్రహం పై ఆదివారం ఉదయం 6 గంటల 28 నిమిషాలకు భానుడి కిరణాలు తాకి 7:45 నిమిషాల వరకు ఈ కాంతికిరణాలు కనువిందు చేశాయి. సురేష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి అంటూ నామ జపం నిర్వహించారు.

ఈ సందర్భంగా సురేష్, మాట్లాడుతూ దేశాన్ని పీడిస్తున్న ఈ కరోనా వైరస్, అకాల తుఫానులు ప్రకృతి వైపరీత్యాలు నుండి యావన్మంది ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అందరి తరపున సంకల్పించుకుని షిరిడి సాయినాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని రోజు ఏదో టైం లో మీ ఇష్ట దైవాన్ని మీకు తోచినన్నిసార్లు నామ జపం చేయండి అని వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sun rays bathe Sai Baba's

You cannot copy content of this page

Scroll to Top