జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 27 at 16.09.39

TRINETHRAM NEWS

Make Malala Atmiya Samamelana a success

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ఎన్టిపిసి లోని లక్ష్మీ నరసింహ గార్డెన్ లో జరుగు మాలల ఆత్మీయ సమ్మేళనం కు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న మాలలు అందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం గోదావరిఖనిలో జరిగిన సమావేశంలో మాల మహానాడు రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు గడ్డం నారాయణ ప్రధాన కార్యదర్శి కడమండ శ్రీహరి మాట్లాడుతూ, మాలలందరూ విచ్ఛిన్నమయ్యారనే అపోహలో ఉన్న కొన్ని వర్గాల పెద్దలకు కనువిప్పు కలిగించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ మాల టీమ్ అధ్యక్షులు బద్దం డేనియల్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి రాజకీయాలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా ప్రముఖులందరూ, మాల జాతి బిడ్డలందరూ హాజరవుతున్నారని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాలలు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఏబిసిడి వర్గీకరణ కుట్రన్ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న మాలలందరు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Make Malala Atmiya Samamelana a success

You cannot copy content of this page