TRINETHRAM NEWS

గ్యాస్ సిలిండర్ పై అదనపు ఛార్జీలు తీసుకుంటే కఠిన చర్యలు

ఆంధ్ర ప్రదేశ్ :

గ్యాస్ పంపిణి దారులు వినియోగదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

డెలివరీ పాయింట్ దూరంగా ఉన్నందున అదనపు ఛార్జీలు ఇవ్వాలని ఎవరైనా డిమాండ్ చెస్తే దిగువ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి.

1) 1967 నంబర్ కి కాల్ చేయండి
2) 18002333555 నంబర్ కి కాల్ చేయండి

సిలిండర్ బరువు పై అనుమానం కలిగితే డెలివరీ బాయ్ వద్ద ఉన్న తూకం వేసే పరికరం ద్వారా సరిచూసుకుని తీసుకునే హక్కు ప్రతీ వినియోగదారునకు ఉంటుందని విజిలెన్స్ అధికారులు తెలిపారు.