TVK petitions in High Court : రాళ్లు రువ్వడం, పోలీసుల లాఠీఛార్జితోనే తొక్కిసలాట జరిగింది; హైకోర్టులో టీవీకే పిటిషన్

TRINETHRAM NEWS

Trinethram News : తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం ఉందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ తమిళగ వెట్రి కళగం (TVK) మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ర్యాలీపై రాళ్లు రువ్వడం, పోలీసులు లాఠీఛార్జి చేయడంతోనే తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొంది. సోమవారం మధురై బెంచ్ ఈ పిటిషన్ ను విచారించనున్నట్లు సమాచారం. శనివారం రాత్రి జరిగిన ఈ తొక్కిసలాటలో 39 మంది చనిపోగా, 50 మందికిపైగా గాయపడ్డారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

TVK petitions in High Court

You cannot copy content of this page

Scroll to Top