సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Sports Mold Youth

Sports Mold Youth : త్రినేత్రం న్యూస్, కడియం, ఆగస్టు 11: క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వాన్ని నేర్పుతాయని బాధ్యతా సేవా సంస్థ అధ్యక్షులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు అన్నారు. కడియం అరుంధతిపేటలోని బాబు జగ్జీవన్‌రావ్ యూత్‌కు మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో వాలీబాల్ నెట్స్, బాల్స్‌తో పాటు ఇతర క్రీడా పరికరాలను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా గిరజాల బాబు మాట్లాడుతూ.. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవడం ద్వారా వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా, చురుకుగా ఉండవచ్చన్నారు. క్రీడలు గెలుపోటములను సమానంగా స్వీకరించే మానసిక స్థైర్యాన్ని పెంపొందించి, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా యువతను తీర్చిదిద్దుతాయని తెలిపారు.యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పున్నమి రాజు వీర్రాజు, బత్తెన శ్రీధర్, కుడేళ్ల పవన్, పలివెల విజయ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page