సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Ganja Supply Network Busted

ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్.. రూ.11.51 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Ganja Supply Network Busted : హైదరాబాద్ నాగోల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నాగోలు ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్ జోన్, నాగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 23.02 కిలోల గంజాయి, రెండు కార్లు, రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.11.51 లక్షలుగా పోలీసులు తెలిపారు.

నిందితులను ఒడిశా కోరాపుట్ జిల్లాకు చెందిన త్రినాథ్ నిరికె (40), సోనా హుంతల్ (28)గా గుర్తించారు. నాగోలు ఎక్స్‌రోడ్ సమీపంలో వాహనాల తనిఖీల సందర్భంగా రెండు కార్ల డిక్కీల్లో దాచిన గంజాయిని గుర్తించి పట్టుకున్నారు. ‘కమ్ము’ అనే వ్యక్తి సూచనల మేరకు గంజాయిని హైదరాబాద్‌కు తరలించినట్లు విచారణలో వెల్లడైంది. పరారీలో ఉన్న కమ్ము కోసం పోలీసులు గాలిస్తున్నారు. మిగతా నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page