వికారాబాద్ జిల్లాలో ‘నెంబర్ ప్లేట్’ నిబంధనల ఉల్లంఘనపై స్పెషల్ డ్రైవ్: 3,325 వాహనాలు సీజ్ – జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్.

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ జిల్లా, నవంబర్ 19: వికారాబాద్ జిల్లాలో సరైన నెంబర్ ప్లేట్లు లేని, టాంపరింగ్ చేయబడిన లేదా అక్రమ నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా 2025 అక్టోబర్ నెలలో మొత్తం 3,325 వాహనాలను సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి వెల్లడించారు. రోడ్డు భద్రత, నేరాల నియంత్రణ మరియు శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.

జిల్లాలోని మూడు సబ్-డివిజన్ల పరిధిలో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, పరిగి సబ్-డివిజన్‌లో అత్యధికంగా 1,843 వాహనాలను సీజ్ చేశారు. ఇందులో పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో 575 వాహనాలు, చేన్గుముల్‌లో 512, కుల్కచర్లలో 204, దోమలో 189, బొంరాస్‌పేటలో 158, దౌల్తాబాద్‌లో 69, దుద్యాల్‌లో 73 వాహనాలు ఉన్నాయి.

వికారాబాద్ సబ్-డివిజన్‌లో మొత్తం 1,085 వాహనాలు సీజ్ అయ్యాయి. వీటిలో వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో 639 వాహనాలు, కోట్పల్లిలో 84, బంట్వారంలో 87, ధారూర్‌లో 69, నవాబ్‌పేట్‌లో 67, మార్పల్లిలో 65, మరియు మోమిన్‌పేట్‌లో 74 వాహనాలు ఉన్నాయి.

ఇక తాండూర్ సబ్-డివిజన్‌లో 397 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. వీటిలో కారన్‌కోట్‌లో 130, తాండూర్‌లో 119, బషీరాబాద్‌లో 99, పెద్దేముల్‌లో 44, మరియు యాలాల్‌లో 5 వాహనాలు ఉన్నాయి.

ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా సరైన నెంబర్ ప్లేట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే, ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లు ప్రతి నెలా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కొనసాగుతాయని తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి, చట్టాలను గౌరవించాలని ఎస్పీ తెలిపినారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Special drive on violation of 'number plate' rules

You cannot copy content of this page

Scroll to Top