TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు కోర్టు ఆవరణంలో సోనియా గాంధీ అఖిలభారత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ లీడర్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో మున్సిప్ కోర్టు ముందు కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా చేయడం జరిగింది లీగల్ అధ్యక్షులు కొప్పుల శంకర్ మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్ మరియు రాష్ట్ర లీగల్ సెల్
కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి సోనియా గాంధీ జన్మదిన కేక వారి చేతుల మీదుగా కట్ చేసి అనంతరం వారు మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చిన గొప్ప నాయకురాలు రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగవుతుందని తెలిసి కూడా తెలంగాణకు ఇచ్చిన ఆమె గొప్పతనాన్ని చాటుకున్న గొప్ప నాయకురాలు అని ఆమె ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం కరీంనగర్ వరంగల్ లాగా సిటీల అభివృద్ధి ఇస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవ్వడి శ్రీనివాస్, లీగల్ సెల్ కన్వీనర్ ముష్క రవికుమార్, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మాదాసి శ్రీనివాస్, పాత అశోక్, దేశెట్టి అంజయ్య, గొటో నరేష్ ,అరుణ్, జగిరి రాజయ్య, నూనె సత్యనారాయణ, ప్రకాష్, 50 మంది న్యాయవాదులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App