
Trinethram News : Telangana : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ కథ విషాదాంతం అయినట్లు తెలుస్తోంది. దాదాపు వారం రోజులపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినా ప్రయోజనం లేకపోయింది. SLBC టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మంది కార్మికులు మృతి చెందినట్లు రెస్క్యూ టీమ్ శుక్రవారం గుర్తించింది. 3 మీటర్ల లోతులో మృతదేహాలు ఉన్నాయని, అత్యాధునిక పరికరాలతో రెస్క్యూ టీమ్ గుర్తించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పుడే టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఘటనపై ఓ క్లారిటీ రానుంది.
నల్గొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు, వందల గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు 2005లో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ప్రారంభించారు. మొత్తం 44 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు చేపట్టగా, ఇదివరకే పలుమార్లు అనివార్య కారణాలతో పనులు నిలిచిపోయాయి.
దాదాపు 35 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ టన్నెల్ నిర్మాణం త్వరగా పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందించాలని పనులు వేగవంతం చేసింది. ఫిబ్రవరి 18న SLBC టన్నెల్ పనులు తిరిగి చేపట్టగా, ఫిబ్రవరి 22న ఉదయం 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలిపోవడంతో విషాదం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో టన్నెల్ పైకప్పు కూలిపోయింది.
నల్గొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు, వందల గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు 2005లో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ప్రారంభించారు. మొత్తం 44 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు చేపట్టగా, ఇదివరకే పలుమార్లు అనివార్య కారణాలతో పనులు నిలిచిపోయాయి. దాదాపు 35 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం ఈ టన్నెల్ నిర్మాణం త్వరగా పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందించాలని పనులు వేగవంతం చేసింది. ఫిబ్రవరి 18న SLBC టన్నెల్ పనులు తిరిగి చేపట్టగా, ఫిబ్రవరి 22న ఉదయం 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలిపోవడంతో విషాదం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో టన్నెల్ పైకప్పు కూలిపోయింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
