IPS officers Promoted : తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్‌లకు డీఐజీగా పదోన్నతులు

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీఐజీ (డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్) హోదాలో పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణరావు ఆదేశాలు విడుదల చేశారు.

ప్రమోషన్ పొందిన అధికారులందరూ 2012 బ్యాచ్‌కు చెందినవారే కావడం విశేషం. వీరిలో శ్వేత, భాస్కరన్, చందన దీప్తి, శింగెనవర్, విజయ్ కుమార్, రోహిణి ఉన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ఆరుగురు ఐపీఎస్ అధికారులు 2026 జనవరి 1 నుంచి డీఐజీలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనుభవం కలిగిన అధికారులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా పరిపాలనా సామర్థ్యం మరింత మెరుగుపడనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Six IPS officers promoted to DIG

You cannot copy content of this page

Scroll to Top