సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సింగరేణి మహిళ ఇంటర్ & డిగ్రీ కాలేజ్
మందమర్రి లో సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహనసదస్సు
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఇటీవల సైబర్ నేరగాళ్ల చేతిలోఎక్కువ గా మోసపోతున్న డిజిటల్ అరెస్టు బాధితులను వారిని అప్రమత్తం చేసేందుకు ఈ అవగాహన కార్యక్రమం
కొద్ది నెలలుగా నమోదవుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే బాధితుల్లో ఎక్కువగా డిజిటల్ అరెస్టు బాధితులు వుంటున్నారు. దాంతో విద్యార్థులను చైతన్యపరచాలని ఉద్దేశ్యం తో సైబర్ జాగృత దివాస్ కార్యక్రమం లో భాగంగా డిజి షికా గోయల్ మేడమ్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ గారు ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల్ జిల్లా మందమర్రి సింగరేణి మహిళా జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో డిజిటల్ అరెస్టు మరియు సైబర్ నేరాలపై అవగాహనా కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
సైబర్ క్రైమ్ డీస్పీ మ . వెంకటరమణ మాట్లాడుతూ*ముఖ్యoగా ప్రస్తుత కాలంలో ఎక్కువగా ప్రజలు మోసపోయి చాలా డబ్బులు పోగొట్టుకున్న డిజిటల్ అరెస్టు కు సంబంధించిన సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది ప్రజలు ఎలా మోసపోతున్నారు అనే దాని గురించి వారికి వివరించారు. అసలు డిజిటల్ అరెస్టు పోలీసు వారు చేయరు అని వివరించి మరియు ఒకవేళ అలాంటి డిజిటల్ అరెస్టు కాల్స్ వస్తే వాటికి ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు వారికి వివరించడం జరిగింది. అంతే కాకుండా cyber Crime www. cybercrime. gov.in, సైబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 ఇంపార్టెంట్స్ పై గురించి తెలిపారు. ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడం తో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని, తమ ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులకు, బంధువులకు, చుట్టూ ప్రక్కల వారికి, మీ గ్రామంలలో కూడా సైబర్ నేరాల గురించి వారు తెలుసుకున్నది వివరించి వారిని కూడా అప్రమత్తం చేయాలి అని చెప్పారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వెంటనే సైబర్ నేరాల గురించి 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని వారికి కి సూచించారు.
ప్రస్తుత నేరాల తీరు పై అవగాహన పెంచుకోవాలి. తెలియని సంబర్ల నుంచి పోన్ కాల్స్ వస్తే సమాచారం ఇవ్వొద్దు. ముఖ్యంగా వాట్సప్ వీడియో కాల్స్ కు అప్రమత్తంగా ఉండాలి. అత్యధిక లాభాలు వస్తాయనగానే అశపడొద్దు డిజిటల్ అరెస్టులకు భయపడొద్దు. క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్లు, పాస్వర్డ్లు, ఓటీపీ మొదలైన వ్యక్తిగత వివరాలను అందించడానికి మోసగాళ్లు బాధితులకు మాయ మాటలు చెప్తారు ఎవ్వరికి చెప్పకూడదు.
సైబర్ మోసగాడు ఆన్లైన్ వెబ్ సైట్ షాపింగ్ చేయడానికి లాటరీని గెలుచుకున్నట్లు ఆశ చూపి ఖాతాలో డిపాజిట్ చేయడానికి పోస్ట్ డేటెడ్ చెక్‌ను అందజేస్తాడు. ముందుగా కొంత డబ్బులు డిపాసిట్ చేయడానికి ఒప్పించి మోసం చేస్తారు.
సైబర్ నేరగాళ్ళు స్నేహితుడిగా లేదా బంధువులుగా నమ్మించడానికి నకిలీ ఖాతాలను సృష్టించి వాట్సాప్, పేస్ బుక్ కాల్స్ చేసి తరువాత వారిని ఏదో ఒక రూపంలో బెదిరించి డబ్బు లాక్కుంటారు.
బ్యాంకులు, సంస్థలు, ఆధార్, పెటమ్ మొదలైన వాటి నుండి కాల్ చేస్తున్నాం అని ఓటీపీ లు, పాస్వర్డ్లు మొదలైన మీ సున్నితమైన ఆర్థిక వివరాలను అడుగుతారు సమాచారం ఎవ్వరికి ఇవ్వొద్దు గుర్తుంచుకొండి. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు మీ వినియోగదారు పేరు, పాస్వర్డ్ లేదా ఇతర బ్యాంక్ వివరాలను ఎప్పుడూ అడగవు.
కొందరు ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. తమ పిల్లలు కుటుంబ సభ్యుల వివరాలను, ఫొటోలను పేస్ బుక్ లో పెడుతుంటారు. ఇలాంటి వాటి నుంచీ నేరగాళ్లు సమాచారం సేకరిస్తున్నారు.
మీకు తెలియకపోతే ఆన్లైన్లో షాపింగ్ చేయడం మానుకోండి తెలిసిన మరియు నమ్మదగిన వెబ్సైట్లను మాత్రమే సందర్శించండి తెలియని వెబ్ సైట్ ల నుండి డౌన్లోడ్ చేయడం లేదా తెలియని వెబ్ సైట్ నుండి లింక్ లను ఓపెన్ చేయడం మానుకోండి.
ఫ్రీ వైఫైని ఉపయోగించడం మానుకోండి. సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, ప్రైవేట్ మరియు వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్‌గా ఆన్లైన్లో భాగస్వామ్యం చేయవద్దు.( ఫోన్ నంబర్; DoB, చిరునామా మొదలైనవి,)
మీరు మీ కంప్యూటర్ను ఉపయోగించనప్పుడు దాన్ని లాగ్ అవుట్ చేయాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ మొబైల్‌ని యాక్సెస్ చేయడానికి ఎల్లప్పుడూ లాక్/పిన్/పాస్వర్డ్/వేలిముద్రను కలిగి ఉండండి.
ఏవైనా సందేహాలు ఉంటే, మీ ఆన్లైన్ కార్యకలాపాలలో మీకు సహాయం చేయడానికి మరియు సమాచారం ఇవ్వడానికి ఎల్లప్పుడూ మీకు నమ్మిన వ్యక్తులకు మాత్రమే మీ పూర్తి వ్యక్తి గత సమాచారం ఇవ్వండి.
ఈ కార్యక్రమంలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ SHO డీఎస్పీ యం.వెంకటరమణ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది, మందమర్రి పోలీసు స్టేషన్ ఎస్ఐ వారి సిబ్బంది మరియు కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App