WhatsApp Image 2024 08 28 at 3.26.12 PM
She complained in public.. she was removed from her job
Trinethram News : ప్రజావాణిలో ఫిర్యాదు చేసినందుకు ఓ మహిళను ఉద్యోగం నుండి తీసేశారు. ఈ ఘటన మేడ్చల్ లో చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లాకు చెందిన రేణుక అనే మహిళ నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేసింది. ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బంది వేతనం రూ.15 వేలు అయితే ఏజెన్సీ కోతపెట్టి రూ. 10 వేలు మాత్రమే ఇస్తోందని, దీని మీద ఉన్నతాధికారులకు చెప్పినా స్పందన లేదని ప్రజావాణిలో రేణుక ఫిర్యాదు చేసింది.
అయితే ఈ విషయం తెలుసుకున్న ఏజెన్సీ ఆ మరుసటి రోజే రేణుకను ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఉన్న ఉద్యోగం పోవడంతో ప్రభుత్వం స్పందించి తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలంటూ రేణుక కోరుతుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
