
ఎస్ ఎఫ్ ఐ. దేవరకొండ డివిజన్.
SFI : దేవరకొండ డివిజన్ జులై 20, త్రినేత్రం న్యూస్. ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని,ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వారికి మద్దతుగా- NTAను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. దేవరకొండ పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అనంతరం జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల ఆశలను మోస్తున్న నీట్-2026 పరీక్ష మరోసారి అవినీతి, నిర్లక్ష్యం, కోచింగ్ మాఫియా – అధికార యంత్రాంగం కుమ్మక్కు కారణంగా విద్యార్థుల శాపంగా మారిందనిఅన్నారు.నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని నీట్-2026 పరీక్షలో పేపర్ లీకేజీ, భారీ అక్రమాలు వెలుగులోకి రావడం మోడీ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.సుమారు 22.79 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నేడు అంధకారంలో పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
2024లో జరిగిన పేపర్ లీక్ ఘటనపై అప్పట్లోనే కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే నేడు ఇంత పెద్ద స్కాండల్ పునరావృతమైందని,పరీక్షా వ్యవస్థను కేంద్రం ,విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను రద్దు చేయాలని లేదా పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. నీట్-2026 పరీక్షను వెంటనే రద్దు చేసి, ఎటువంటి అదనపు ఫీజులు లేకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపి పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని కోరారు. నష్టపోయిన విద్యార్థులకు మానసిక, ఆర్థిక పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.అంతేకాకుండా, రాష్ట్రాలకు తమ స్వంత ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే హక్కును కల్పించాలని, విద్యను కార్పొరేట్ వ్యాపారంగా మార్చే విధానాలను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.
కాక్రోక్ జనతా పార్టీ గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరవధిక దీక్ష చేపట్టిన కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు.పరీక్షల రద్దుతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్,వినోద్ జయరాం, సుధాకర్, పరమేష్, మహేష్, సాయిరాం, జోసెఫ్,మణికంఠ,శివ, సతీష్,రవి, ప్రవీణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe