TRINETHRAM NEWS

Trinethram News : టీఎస్‌ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ తార్నాకలో నిర్వహిస్తున్న నర్సింగ్‌ కళాశాలలో ఉన్న పలు ఖాళీల భర్తీకి ఆర్టీసీ తాజాగా మరో నోటిఫికేషన్‌ జారీచేసి ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ట్యూటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.వీటిలో ప్రొఫెసర్‌ 1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 3, ట్యూటర్‌ 2 ఖాళీలు ఉన్నాయి. ఎమ్మెస్సీ నర్సింగ్‌ చేసి, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లిస్తారు. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.