TRINETHRAM NEWS

పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు పెంచాలి
ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పార్కింగ్ సమస్యలు తీర్చాలి…
Trinethram News : కాకినాడ,ఫిబ్రవరి,01: కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో శనివారం ఉదయం ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ కాంట్రాక్ట్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ AITUC అనుబంధ సంఘం సమావేశం యూనియన్ అధ్యక్షులు కే. రామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు.

ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులకు జీతాలు పెంచాలని, పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26 వేల రూపాయలు మంజూరు చేయాలని, వారిని పర్మినెంట్ చేయాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. కాకినాడ లో జిల్లా వ్యాప్తంగా ఉన్న పి.హెచ్.సి, సిహెచ్ సి, ఏరియా హాస్పిటల్ లు ను సందర్శించి హాస్పటల్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్, సానిటేషన్ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నామని, అన్ని హాస్పిటల్ లో పని విధానాలు ఒకటైన జీతాలు మాత్రం వేరువేరుగా మంజూరు చేస్తున్నారని కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాంట్రాక్టర్ పరిధి ముగిసిన ఇంకా కొత్త టెండర్ల విధానం అమల్లోకి రాలేదని, కొత్త కాంట్రాక్టర్ టెండర్ విధానంలో జిల్లా వ్యాప్తంగా సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులకు ఒకే రకమైన జీతాలు మంజూరు చేయాలని, జిల్లా అంతట వారి సమస్యలపై త్వరలో ఆందోళన చేపడుతామని ప్రసాద్ అన్నారు. ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రి లో పనిచేస్తున్న చేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులు అందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 26000 వేలు జీతం మంజూరు చేయాలని, పిఎఫ్ పిఎస్ఏ బకాయిలు చెల్లించాలని, ఈఎస్ఐ హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులు మంజూరు ఆయన అన్నారు.

ప్రభుత్వ సామాన్య హాస్పిటల్ లో చికిత్స కొరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, విశాఖ జిల్లా రోజుకి 3500 నుండి 4000 వరకు పేద ప్రజలు వైద్యం నిమిత్తం వస్తున్నారని, వారికి బైక్ పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలం కేటాయింపు పై జిల్లా కలెక్టర్ గారు, ఆస్పత్రి సూపర్డెంట్, ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోవాలని ప్రసాద్ అన్నారు, ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, జానుబాబు, మధు, వెంకటేష్, రమణమ్మ, అప్పన్న, రాము తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Salaries of security guards