TRINETHRAM NEWS

RTC buses canceled due to heavy rains

Trinethram News : హైదరాబాద్ : సెప్టెంబర్ 2: తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు.నిన్న రాత్రి వరకు 877 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ఈరోజు(సోమవారం) ఉదయం నుంచి 570 బస్సులను రద్దు చేశారు. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ , మహబూబ్‌బాద్ వైపుగా వెళ్ళే రోడ్లన్నీ జలమయం అవ్వడంతో బస్సు రూట్‌లనుు పూర్తిగా బంద్ చేశారు.

వరద ఉధృతి తగ్గిన తర్వాత మళ్ళీ బస్సులను నడుపుతామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సులను గుంటూరు మీదుగా దారిమళ్లించారు.ఖమ్మం జిల్లాకు యధావిధిగా బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.

మరోవైపు ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా మహారాష్ట్రలోని విదర్భలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలోనే విదర్భకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వెస్ట్ మధ్యప్రదేశ్, మరాఠవాడ, తెలంగాణ, గుజరాత్ అస్సాం మేఘాలయలో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. వెస్ట్ మధ్యప్రదేశ్, మరాఠవాడ, తెలంగాణ , గుజరాత్, అస్సాం, మేఘాలయకు ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.

అటు రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవవుతున్నాయి. జనజీవనం స్తంభించింది. కాలనీలకు కాలనీలే వరద నీటిలో చిక్కుకుపోతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. నదులు, ఏరులు, వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కొన్ని ప్రాంతాల వాసులు పూర్తిగా పునరావాస కేంద్రాలకు చేరారు. సమయానికి ఆహారం, నీరు, నిద్ర అన్నీ కరువై అలమటిస్తున్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

RTC buses canceled due to heavy rains