అక్టోబర్ 28, 2026
TRINETHRAM NEWS
Road Safety Awareness Program

Road Safety Awareness : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్, తేదీ: 28-10-2026 :హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో, ఈరోజు MGBSలోని TGSRTC రీజినల్ ట్రైనింగ్ సెంటర్‌లో బస్ డ్రైవర్లకు “Arrive Alive – సురక్షితంగా ప్రయాణిద్దాం, సురక్షితంగా గమ్యాన్ని చేరుకుందాం” అనే అంశంపై రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డ్రైవర్లకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు:

  • నిర్ణీత వేగ పరిమితులను పాటిస్తూ బస్సులను నడపాలి.
  • మద్యం సేవించి వాహనాలను నడపకూడదు.
  • డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ ఉపయోగించకూడదు.
  • ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచికలు, లేన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
  • బస్సులను నిర్ణీత బస్ స్టాపుల వద్ద మాత్రమే ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలి, దించాలి.
  • పాదచారులు, ద్విచక్ర వాహనదారులు మరియు ఇతర రహదారి వినియోగదారుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి.
  • డ్రైవింగ్‌కు ముందు తగిన విశ్రాంతి తీసుకోవడంతో పాటు వాహనం సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి.

ప్రతి ప్రయాణికుడి ప్రాణం అమూల్యమైనదని, బస్ డ్రైవర్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. కొన్ని నిమిషాలు ముందుగా గమ్యాన్ని చేరడం కంటే, ప్రతి ప్రయాణికుడిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం ఎంతో ముఖ్యమని వివరించారు.

అనంతరం, రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని, విలువైన మానవ ప్రాణాలను కాపాడుతామని బస్ డ్రైవర్లతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమానికి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్-II) శ్రీ C. Venu Gopal Reddy గారు, TGSRTC కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ శ్రీ రఘు గారు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ప్రసాద్ వర్మ గారు, శ్రీ రాజు గారు మరియు ఇతర సిబ్బంది హాజరయ్యారు.

“ARRIVE ALIVE – సురక్షిత డ్రైవింగ్, సురక్షిత ప్రాణాలు” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించడం మరియు ప్రయాణికుల భద్రతను నిర్ధారించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.

గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page