పెనుమూరులో రెవెన్యూ సదస్సు
ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్. పెనుమూరు మండలం పెనుమూరు ఇంచార్జ్. జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. సదస్సులో రైతుల ఇబ్బందులు అర్జీల ద్వారా పెనుమూరు మండల రెవెన్యూ అధికారి శ్రావణ్ కుమార్ కు అర్జీలు అంద చేశారు. ఈ సదస్సులో మూడు పంచాయతీల రైతులు పాల్గొన్నారు. పెనుమూరు పంచాయతీ, రామకృష్ణాపురం పంచాయతీ, చిప్పారపల్లి పంచాయతీ రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు తెలుగుదేశం మండల అధ్యక్షులు పెద్దినేని రుద్రయ్య నాయుడు, తెలుగుదేశం చిత్తూరు పార్లమెంట్ కార్యదర్శి తల రెడ్డప్ప మరియు కార్యాలయ సిబ్బంది సర్వేర్ ప్రకాష్, శ్యామ్, డిజిటల్ అసిస్టెంట్ బాలాజీ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App