TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:ఏప్రిల్ 16 : రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, జపాన్ దేశంలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం జపాన్ పర్యటనకు నిన్న రాత్రే వెళ్ళింది.నేటి నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా, హిరోషి మా నగరాల్లో పర్యటించను న్నారు. ఈ పర్యటనలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సెక్రటరీ జయేశ్ రంజన్ కూడా వెళ్లనున్నారు.

గతంలో దావోస్‌లో జరిగిన ఆర్థిక సదస్సులో కూడా సీఎం రేవంత్ పెట్టుబడుల కోసం పాల్గొని అనేక పెట్టుబడులను సాధించా రు.టోక్యోలోని వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవు తున్నారు.

ఏప్రిల్ 17న తోషిబా ఫ్యాక్టరీని సందర్శించి కంపెనీ కార్యకలాపాలపై అవగాహన పొందనున్నా రు. ఏప్రిల్ 18న గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి.. టోక్యో గవర్నర్‌తో సమావేశం, పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశం జరపనున్నారు.

ఆ తర్వాత ప్రముఖ కంపినీలైన టొయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీ సంస్థల సీఈఓ లతో వరుస భేటీలు షెడ్యూల్ అయ్యా యి.ఆపై సీఎం రేవంత్ రెడ్డి సుమిదా రివర్‌ ఫ్రంట్‌, మౌం ట్ ఫుజీ, అరకురయామా పార్క్, కిటాక్యూషు సిటీ ఎకో టౌన్ ప్రాజెక్టులు, ఎన్విరాన్‌మెంట్ మ్యూజి యం, మురసాకి రివర్ మ్యూజియాలను సందర్శించనున్నారు.

అలాగే ఏప్రిల్ 21న ఒసా కాలో జరిగే వరల్డ్ ఎక్స్‌పో – 2025లో తెలంగాణ పవిలియన్‌ను సీఎం అధికారికంగా ప్రారంభించ నున్నారు. అదేరోజు బిజి నెస్ రౌండ్‌టేబుల్ సమావే శంలో పాల్గొనబోతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇక జపాన్ పర్యటన చివరరి రోజు ఏప్రిల్ 22న హిరోషిమా చేరుకుని పీస్ మెమోరియల్ సందర్శన, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి, హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్‌లతో భేటీలు జరుగనున్నాయి. మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీ, హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కూడా సందర్శించి చర్చలు జరుపనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Revanth Reddy's Japan tour