TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : దోమ.గ్రామాల అభివృద్ధి కి అప్పులు తెచ్చిఖర్చు చేసిన మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని “పోస్ట్ కార్డుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కి విన్న వించినట్లు వికారాబాద్ జిల్లా సర్పంచుల నేత కె రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ప్రతి పక్ష హోదాలో శాసన సభ ఎన్నికల ముందు ప్రచారం లో గౌరవ రేవంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధి కి నిధులు వెచ్చించిన సర్పంచ్ లకు పెండింగ్ బిల్లులు కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంబడే చెల్లించి సర్పంచులను కడుపులో పెట్టుకొని చూ సుకుంటామని చెప్పారనికానీ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తున్నసర్పంచులకు రావలిసిన పెండింగ్ బిల్లుల మాట ఊసే లేదని రాజిరెడ్డి ప్రస్తావన చేస్తూ రాష్ట్ర సర్పంచ్ల ఐకాసా పిలుపు మేరకు పలువురు సర్పంచులతో కలిసి పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు గ్రామాల వారీగా సర్పంచ్లు తమకి గ్రామపంచాయతీ లద్వారా రావాల్సిన బకాయిల వివరాలను నమోదు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం కు పోస్ట్ చేసినట్లు రాజిరెడ్డి చెప్పారు ప్రభుత్వం ఇప్పటికైనా అలోచించి వేల మంది సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని సీఎం రేవంత్రెడ్డి వారి మంత్రి వర్గం కు విజ్ఞప్తి చేస్తున్నట్లు రాజిరెడ్డి చెప్పారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Request to CM for