![WhatsApp Image 2025 02 13 at 21.27.08](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-13-at-21.27.08.jpeg)
9వ డివిజన్ జనగామ లో మురికి కాలువ లను శుభ్రం చేయించండి. సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 9వ డివిజన్ జనగామ లోని గణేష్ నగర్ వాడలో మురికి కాలువలను శుభ్రం చేయించాలని, చెత్త కుప్పలను తొలగించి వాడ ప్రజలు అనారోగ్యాలకు గురి కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ ఒక ప్రకటన లో కోరారు.
మురికి కాలువ ల్లోని పూడికను తొలగించక పోవడం వల్ల కాలువల్లో మురికి నీరు నిల్వ ఉండి దోమలు ఈగలు వ్యాప్తి చెంది వాడ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, దీంతో పాటు చెత్త కుప్పలను తొలగించక పోవడం వల్ల దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి 9వ డివిజన్ జనగామ లోని గణేష్ నగర్ వాడలో ఉన్న మురికి కాలువ ల్లోని పూడికను తొలగించాలని అదేవిధంగా వాడలో ఉన్న చెత్త కుప్పలను తొలగించి వాడ ను శుభ్రంగా ఉంచాలని, ప్రజలు అనారోగ్యాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Remove trash piles](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-13-at-21.27.08-576x1024.jpeg)