
Remain Alert : అనకాపల్లి జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 02 ; పాయకరావుపేట నియోజకవర్గం డైనమిక్ శాసన సభ్యురాలు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, మురసు తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లతో ఆమె టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఆ తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెద్ద పెద్ద గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి అధికార హెచ్చరికలు పాటించాలని సూచించారు. అత్యవసర సాయం కోసం 112,1070 నంబర్లను సంప్రదించాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe