Rape and murder of a six-year-old girl in Pedpadalli district
చిన్నారిని చిదిమేసిన మానవ మృగం
గంజాయి మత్తులో రాక్షస క్రీడ
పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలిక పై అత్యాచారం, హత్య
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
*కామందున్ని జనసమూహంలో కఠినంగా శిక్షించాలని, కామాపిచాచి దిష్టి బొమ్మను ఖని ప్రధాన చౌరస్తాలో దహనం చేసిన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ,సీతారామ సేవ సమితి స్వచ్ఛంద సంస్థలు.
అభం శుభం తెలియని చిన్నారి సహస్రను మానవ మృగం చిదేమేసింది, ముక్కు పచ్చలారని చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసిన కామాంధున్ని జన సమూహంలో కఠినంగా శిక్షించాలని శనివారం రోజున గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మానవ మృగం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని శ్రీసీతారామ సేవ సమితి, ఫైట్ ఫర్ బెటర్ సొసైటి స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తెలిపారు.
అనంతరం సీతారామ సేవ సమితి అధ్యక్షులు గొలివాడ చంద్ర కళ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ లు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా గంజాయి మత్తులో ఓ మానవ మృగం రెచ్చిపోయి కామ క్రీడలు తీర్చుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా జరగడం దారుణం అని అవేదన చెందారు.
పొట్టచేత పట్టుకొని ఉపాధి కొరకు ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలానికి చెందిన దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తాన్ బాద్ కట్నాపల్లిలోని ఒక రైస్ మిల్లు లో పనికి కుదిరిన సందర్భంగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా సమీప రైస్ మిల్లు లో హామలిగా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలి అయిన కిరాతకుడు వినోద్ మాజ్ఞి ఆరేళ్ల చిన్నారి పై కన్నపడగా అత్యాచారం చేసి హత్య చేసిన కామందున్ని జనసమూహంలో ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
రోజు రోజుకు ఆడపిల్లలన్న తల్లి తండ్రులు సమాజంలో ఇలాంటి ఆకృత్యాలు జరుగుతుంటే కంటి మీద కునుకు లేక భయభ్రాంతులకు గురైతున్నారని, పక్క దేశాలలో ఇలాంటి సంఘటనలు జరిగితే కఠినమైన శిక్షలు వేస్తూ పునరావృతం కాకుండా ఉండే చట్టాలు అమలు చేస్తుంటే మన దేశంలో అలాంటి చట్టాలు లేకుండా పోయేసరికి రోజు రోజుకు ఇలాంటి ఆకతాయిల అల్లర్లు రేపులు మానభంగాలు అత్యాచారాలు హత్యలు ఎక్కువైతున్నాయని, ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సహస్ర కుటుంబానికి రైస్ మిల్లు యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని తండ్రికి ఉద్యోగం కేటాయించాలని, కామాందున్ని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సీతారామ సేవా సమితి సభ్యులు కంది సుజాత, మేడగోనీ స్వప్న, మందల రమాదేవి, జీ.సరిత, లక్ష్మీ, పిట్టల చంద్రకళ, బోగే లత, మరియు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఉద్యక్షులు రేణికుంట్ల నరేంద్ర, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App