TRINETHRAM NEWS

Random Checks & Drunk and Drive across Ramagundam Police Commissionerate

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ) ఆదేశాల మేరకు రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి జోన్, మంచిర్యాల జోన్ వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల తనిఖీలలో ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై , ఇన్సూరెన్స్ లేని వారిపై, నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని, వాహనాలపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు.

వాహనదారులు తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు , లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది.

ప్రజలకు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆత్మ హత్యలు, లైంగిక వేదింపులు, గంజాయి వంటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాల పై, షీ టీమ్, డయల్ 100 గురించి మరియు వివిధ నూతన చట్టాలపై ప్రజలను చైతన్యం చేస్తూ అవగాహన కల్పించడo జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Random Checks & Drunk and Drive across Ramagundam Police Commissionerate