WhatsApp Image 2024 06 19 at 17.12.16
Rahul Gandhi’s birthday celebrations in Godavarikhani
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కౌటం సతీష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి హాజరై స్థానిక ప్రధాన చౌరస్తాలో కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్బంగా కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదరబోయిన రవికుమార్ మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉంటా అని ధైర్యాన్ని ఇచ్చిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారిని భారత దేశ ప్రధాని గా చూడాలని వారు ఆకాంక్షించారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
