WhatsApp Image 2024 03 19 at 11.25.08
Trinethram News : Mar 19, 2024,
ఉపరాష్ట్రపతి కావొచ్చనే తమిళిసై రాజీనామా: మంత్రి రాధాకృష్ణన్
గవర్నర్ తమిళిసై పై మంత్రి అనితా రాధాకృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు మారితే ఉపరాష్ట్రపతి కావొచ్చని తమిళిసై భావిస్తున్నారని ఆయన విమర్శించారు. కన్నియాకుమరిలో మాట్లాడిన ప్రధాని జాలర్లకు డీఎంకే, కాంగ్రెస్ ఏమీ చేయలేదన్నారని, బీజేపీ ఎంతమందిని కాపాడిందో లెక్కలు చూపితే దానికి జవాబు ఇస్తామన్నారు. వారిని కాపాడేందుకు హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని, అది ఇంకా నెరవేరలేదన్నారు.
