TRINETHRAM NEWS

AP CM YS Jagan : పేద పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య..స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

AP CM YS Jagan : అమ‌రావ‌తి – వైసీపీ స‌ర్కార్ విద్యాభివృద్దికి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పారు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. పేద పిల్ల‌ల‌కు కూడా కార్పొరేట్ వైద్యం అందించాల‌న్న‌దే త‌మ ముఖ్య‌మైన ఉద్దేశ‌మ‌న్నారు. దేవుడి ద‌య‌తో మ‌రో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టామ‌ని తెలిపారు.

AP CM YS Jagan Comment
ప్ర‌తి ఏడాది క్ర‌మం త‌ప్ప‌కుండా నిధుల‌ను విడుద‌ల చేస్తూ వ‌చ్చామ‌న్నారు. ఇందులో విద్యా దీవెన ప‌థ‌కం కింద రూ. 584 కోట్ల ఆర్థిక సాయం అంద‌జేసిన‌ట్లు చెప్పారు జ‌గ‌న్ మోహ‌ణ్ రెడ్డి(AP CM YS Jagan). దీని ద్వారా 8 ల‌క్ష‌ల 9 వేల మంది పిల్ల‌ల‌కు మేలు చేకూరింద‌న్నారు.

వ‌స‌తి దీవెన కింద రూ.4,275 కోట్లు ఇచ్చిన‌ట్లు చెప్పారు సీఎం. నాలుగున్న‌ర ఏళ్ల‌లో కీల‌క‌మైన మార్పులు తీసుకు వ‌చ్చామ‌ని తెలిపారు. ఆంగ్ల మాధ్య‌మాన్ని ప్ర‌వేశ పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. 27.61 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ అంద‌జేసిన‌ట్లు తెలిపారు.

త‌ర‌గ‌తి గ‌దుల‌ను డిజిట‌ల్ క్లాస్ రూములుగా మార్చామ‌న్నారు. ఎంతో విలువైన బైజూస్ కంటెంట్ ను అంద‌జేసిన‌ట్లు చెప్పారు. బ‌డుల్లో సబ్జెక్టులకు సంబంధించి టీచ‌ర్ల‌ను నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు.