రాజస్థాన్ లో వైభవంగా పివి సింధు వివాహం!
Trinethram News : డిసెంబర్ 23
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిం ది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథుల సమక్షం లో ఈ ఇద్దరూ రాత్రి 11.20 గంటలకు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ ఈ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇక మంగళవారం హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది.ఆటలపై ఆసక్తి
సింధు భర్త సాయి వెంకట దత్తా బ్యాడ్మింటన్ ఆడరు కానీ ఆయనకు ఆటలపై బాగానే ఆసక్తి ఉంది.
మోటార్ స్పోర్ట్స్‌లో తనకు ప్రవేశం ఉంది. డర్ట్ బైకింగ్, మోటార్ ట్రెక్కింగ్‌లో తరచూ పాల్గొంటుంటారు. తన దగ్గర డజను సూపర్ బైక్స్‌తో పాటు కొన్ని స్పోర్ట్స్ కార్లూ ఉన్నాయి. తన తండ్రి గౌరెల్లి వెంకటేశ్వ రరావు ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మాజీ అధికారి.ప్రస్తుతం సాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ప్రోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థను ఆయనే నెల కొల్పారు.
సాయి తల్లి లక్ష్మి. ఆమె తండ్రి భాస్కరరావు హైకోర్టు జడ్జిగా పదవీ రిటైర్ అయ్యారు. భాస్కరరావు అన్న ఉజ్జిని నారాయణ రావు సీపీఐ పార్టీ తరఫున నల్గొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యేగా సేవలు అందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App