ప్రజా సంక్షేమమే మా లక్ష్యం.
ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ (అరకు లోయ పట్టణం) అల్లూరి సీతారామరాజు జిల్లా:
ప్రజా సంక్షేమమే మా లక్ష్యం టిడిపి కేంద్ర కార్యాలయం లో వినతులు స్వీకారిస్తున్న రాష్ట్ర జి.సి.సీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్:*
రాష్ట్ర రాజధాని విజయవాడ లో మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రజలు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాలను ప్రజలు ఇచిన వినతులను స్వీకరించారు ఈ సందర్బంగా రాష్ట్ర జి.సి.సి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ప్రజల కష్టాలు కోరికలు నెరవేర్చడం టిడిపి ప్రభుత్వం భాద్యత అని ప్రజలు వివిధ సమస్యలపై వినతులు చేసి ఉన్నారానీ సంభందిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని కూటమి ప్రభుత్వం లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది అని దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలోనే గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సమస్య పరిష్కారానికి ఆయా శాఖల దృష్టికి ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను పంపిస్తున్నామని ఎప్పుడు ప్రజా సమస్యలపైనే తెలుగుదేశం పార్టీ దృష్టి పెడుతుందని అది ఒక్క విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబుకే సాధ్యమని ప్రజా సమస్యలు పరిష్కారానికి వేదికగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉంటుందని ఏ సమస్య ఉన్న నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తో కలిసే అవకాశం ఉంటుందని టిడిపి అనేది ప్రజల పార్టీ అని రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు రాష్ట్ర జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే రాధాకృష్ణ రాష్ట్ర పర్యావరణ కార్పొరేషన్ చైర్మన్ పొలం రెడ్డి దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App