
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు ఆదేశించారు.
సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 133 పిర్యాదులు సమర్పించారని, వాటిలో ధరణి కి సంబంధించిన భూ సమస్యలు , ఆసరా పెన్షన్లు , ఇరిగేషన్ , భూ సర్వే ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మండలాలకు సంబంధించిన పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన భూ సమస్యలపై పిర్యాదులను పరిశీలించారు.
ఆన్లైన్ రికార్డు చెక్ చేసి, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి రిపోర్ట్ పంపించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలనీ ఆదేశించారు. భూ సమస్యలకు సంబంధించిన పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఆర్ డి ఓ వాసు చంద్ర , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
