జూలై 7, 2026
TRINETHRAM NEWS
Protest at Indira Park for Lawyers

Protest at Indira Park : హైదరాబాద్: న్యాయవాదుల భద్రత కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఈ దీక్షకు మద్దతు తెలిపారు.
ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైకోర్టు అడ్వకేట్ బి.ఆర్. కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే లాయర్ల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, వారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యతని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంజనేయులు గౌడ్ తో పాటు పలువురు హైకోర్టు న్యాయవాదులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

You cannot copy content of this page