
నారీమల్ల ప్రవళిక కు పలువురి అభినందనలు
Pravalika : డిండి (గుండ్ల పల్లి)జూలై 12, త్రినేత్రం న్యూస్ : చైనాలోని ఓర్డోస్‌లో జరిగిన 1వ ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే రేసులో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించిన డిండి మండలకేంద్రానికి చెందిన క్రీడా కెరటం నారిమల్ల ప్రవళికకు పలువురు గ్రామప్రజలు , నాయకులు అభినందనలు తెలియజేశారు.
ప్రవళికను ఒక అంతర్జాతీయ ఛాంపియన్‌గా తీర్చిదిద్దడంలో అహర్నిశలు కృషి చేసిన ఆమె కోచ్ పస్పుల పరుశురాముడు స్పోర్ట్స్ అకాడమీ యాజమాన్యానికి గ్రామప్రజలు , నాయకులు క్రీడాభిమానులు , బంధువులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe