TRINETHRAM NEWS

ప్రభాస్‌ కాలికి స్వల్ప గాయం

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ కాలికి స్వల్ప గాయమైంది. సినిమా చిత్రీకరణలో భాగంగా ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ప్రభాస్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు..

ఆయన కీలక పాత్రలో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ప్రస్తుతం ఈ మూవీ జపాన్‌ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రభాస్‌ అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జపాన్‌ అభిమానుల కోసం ఓ పోస్టును విడుదల చేశారు.

”నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. జపాన్‌లోని అభిమానులను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ, మీరు నన్ను క్షమించాలి. మూవీ షూటింగ్‌లో నా కాలికి స్వల్ప గాయమవడంతో రాలేకపోతున్నా” అని ప్రభాస్‌ పేర్కొన్న పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘కల్కి 2898 ఏడీ’ 2025 జనవరి 3న జపాన్‌లో విడుదల కానుంది.

ప్రస్తుతం ఏ అగ్ర కథానాయకుడు లేనంత బిజీగా ప్రభాస్‌ ఉన్నారు. మారుతీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ ‘ది రాజా సాబ్‌’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ ఏప్రిల్‌ 10, 2025న విడుదల కానుంది. ఇప్పటివరకూ ప్రభాస్‌ కనిపించని సరికొత్త పాత్రలో ఆయన అలరించనున్నారు. దీంతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీలో నటిస్తున్నారు. ఇమాన్వీ ఎస్మాయిల్‌ కథానాయిక. అలాగే, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌2: శౌర్యంగపర్వంలోనూ ఆయన నటించాల్సి ఉంది. ఇప్పటికే దర్శకుడు సందీప్‌ వంగా ‘స్పిరిట్‌’ స్క్రిప్ట్‌ను ఫైనలైజ్‌ చేశారు. తుది మెరుగులు దిద్దుతున్నారు. అలాగే మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ను కూడా మొదలు పెట్టారు. ఈ మూవీ కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చేలోపు నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి2’ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటారు. మరొక విషయం ఏంటంటే.. ఇప్పుడు ప్రభాస్‌ చేస్తున్న సినిమాలన్నీ పాన్‌ ఇండియాలే

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App