Power Supply Disruption : విద్యుత్ సరఫరాలో అంతరాయం

TRINETHRAM NEWS

డిండి మండలకేంద్రంలో తరచూ నిలుపుదల.
ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని సిబ్బంది.
డిండి (గుండ్ల పల్లి) జూన్ 14 త్రినేత్రం న్యూస్ : డిండి మండలకేంద్రంలో కొన్నినెలలుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.దీంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు పనుల నిమిత్తం వచ్చేవారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల కార్యాలయాలకు వచ్చేవాళ్లు గంటల కొద్ది నిరీక్షణ చేయాల్సి వస్తుంది.
రాత్రి వేళలో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేయడం వలన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ సిబ్బంది సంబంధిత అధికారులు స్పందించి దిండి మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Power supply disruption

You cannot copy content of this page

Scroll to Top