Potti Sriramulu Jayanti Celebrated : పెనుమూరు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల లో పొట్టి శ్రీరాములు జయంతి

TRINETHRAM NEWS
Potti Sriramulu Jayanti celebrated

Potti Sriramulu Jayanti Celebrated : త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి.పెనుమూరు మండలంలోని ప్రభుత్వ హై స్కూల్‌ ఆవరణలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో పెనుమూరు టీడీపీ మండల అధ్యక్షుడు పి. రుద్రయ్య నాయుడు, తలారి రెడ్డప్ప, యువత అధ్యక్షుడు చిరంజీవిరెడ్డి, స్కూల్ చైర్మన్ మునీంద్ర పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఆయన ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయబృందం, విద్యాత్రిని,విద్యార్థులు పాల్గొని పొట్టి శ్రీరాములు సేవలను ఘనంగా స్మరించుకున్నారు.

You cannot copy content of this page

Scroll to Top