
తేదీ : 10/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మాజీ సీయం జగన్ అనుషిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని విజయవాడ పోలీసులు డిమాండ్ చేయడం జరిగింది. స్పందిస్తూ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల. శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్న అనంతపురం జిల్లా లో వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని, కేవలం ఇది రాజకీయ ఎత్తు కొరకు ఊగుతున్నట్టు అనిపిస్తుంది అని పేర్కొన్నారు. యూనిఫామ్ ఒక ఒక్క అవకాశం లాంటిది అని తెలిపారు. ఈ ఉద్యోగం చేయడం సామాన్య విషయం కాదని పేర్కొన్నారు. అదేవిధంగా రాజ్యాంగ హక్కులు కాపాడేది అని అన్నారు. ఇలా మాట్లాడుతుంటే శాంతి భద్రతలు ఎక్కడ నుండి వస్తాయన్నారు. బట్టలు ఊడదీసి చూద్దామని ప్రశ్నించారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఐదువేల మంది మహిళా పోలీసులు ఉన్నారు జగన్ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చట్టపరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
