Police raids at banks in Godavarikhani 1 town
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకుల వద్ద అమాయక బాధితుల నుండి డబ్బు దొంగతనాలు, ATM ల వద్ద మోసం చేసి డబ్బులు దొంగతనాలకు పాల్పడకుండా, ఇతర నేరాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను తనిఖీ చేయడం జరిగింది.
బ్యాంక్ ల వద్ద భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు మరియు అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే అలారం సిస్టం పనితీరు ను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా బ్యాంకు సంబంధించిన సిబ్బందితో బ్యాంకులలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే వెంటనే డయాల్ 100 కాని, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలపడం జరిగింది.
ఈ తనిఖీల్లో గోదావరిఖని వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App