‘Bharosa’ Center : ‘భరోసా’ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్

TRINETHRAM NEWS

మహిళలకు అండగా భరోసా కేంద్రాలు

తక్షణమే బాధితులకు సూచనలు, సలహాలు, సహాయం అందించాలి

పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ఐపిఎస్.,

మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్ కు వచ్చే వరకూ, పరిహారం ఇప్పించేవరకూ “భరోసా సెంటర్” అండగా నిలుస్తుందని పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అన్నారు. సిసిసి నస్పూర్ పాత పోలీస్ స్టేషన్ భవనంలో వున్న భరోసా సెంటర్ ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను అక్కున చేర్చుకుని వారికి వైద్యుడు, సైకాలజిస్టు, న్యాయాధికారి,పోలీసులు న్యాయ సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ‘భరోసా’ కేంద్రం పని చేస్తుందని అన్నారు.

బాధితులు రాగానే ఎవరి పరిధిలో వారు పనిచేస్తూ సత్వర న్యాయానికి కృషి చేస్తారని పెర్కొన్నారు. లైంగిక దాడులకు గురైనా బాధితులకు భరోసా కల్పించడంతో పాటు వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మంచిర్యాల జోన్ లో ఎక్కడైనా పోక్సో, లైంగికదాడుల కేసులు నమోదు కాగానే బాధితులను నేరుగా భరోసా సెంటరుకు తీసుకొస్తున్నామన్నారు. తక్షణమే బాధితులకు సూచనలు, సలహాలు అందించాలని అధికారుల ను, సిబ్బందిని ఆదేశిస్తున్నామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయపరమైన సూచనలు అందించి, వారికి ఎవరూ లేనప్పుడు భరోసా సెంటర్ లో ఆశ్రయం కల్పించాలన్నారు.

వీటితో పాటు ఈ భరోసా సెంటర్లు బాధితులకు నైపుణ్యాలను నేర్పించి, వారిని సమాజంలో ఉన్నతంగా జీవించేలా దోహదపడుతుందన్నారు అందుబాటులో వున్న లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సెలింగ్ గదులు, స్టేట్మెంట్ రికార్డు సమావేశ గదులను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు
ఈ కార్యక్రమం లో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు. స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్, మంచిర్యాల షీ టీమ్ ఇంచార్జి ఎస్ఐ హైమ, సిసి హరీష్, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bharosa' center

You cannot copy content of this page

Scroll to Top