TRINETHRAM NEWS

Visible policing should be visible within the police station visited Devapur Police Station Commissioner of Police Srinivas IPS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్ డివిజన్ మందమర్రి సర్కిల్ పరిధిలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్లను చేరుకున్న సీపీ ముందుగా పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అని సూచించారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ నలోని సిసిసి పిటిషన్ లను వాటి రికార్డ్ లను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదుల విషయం లో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి.

పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులు, ఇక్కడ ఉండే ప్రజల , ఫ్యాక్టరీల గురించి, కాలనీ, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, ట్రాఫిక్ సమస్య లు, లా ఆర్డర్ సమస్యలు, క్రైమ్ నియంత్రణ చర్యలు, సిసి కెమెరాల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి గ్రామం లో ఒక ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవాలి. ప్రజలు, యువత తో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలి ఏదైనా సమాచారం వచ్చిన వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వెళ్ళాలి అని సూచించారు.

యువత భవిష్యత్తు కోసం ఉద్యోగాలకోసం ప్రయత్నం చేసేవారికి పోలీస్ తరుపున ఎప్పుడు అండగా ఉండాలి అన్నారు. బ్లూ క్లోట్స్ సిబ్బంది డయాల్ 100 కాల్స్ కి వెంటనే స్పందించి వారు సంఘటన స్థలంకి త్వరగా చేరుకోవాలని సూచించారు. వారి తో అక్కడ పరిస్థితి కంట్రోల్ కానప్పుడు వెంటనే ఎస్ఐ సిబ్బందికి సమాచారం అందించి వెంటనే పిలిపించుకోవాలన్నారు. బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బంది విసబుల్ పోలిసింగ్ నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి,మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.

పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అధికారులతో కలిసి సిపి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, ఎస్ఐ ఆంజనేయులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Visible policing should be visible within the police station visited Devapur Police Station Commissioner of Police Srinivas IPS