TRINETHRAM NEWS

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి

తేదీ : 15/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం పనులు 2027 వ సంవత్సరం జూన్ నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడం జరిగింది. నిర్దేశించుకున్న లక్ష్యం మేర పనులు జరగకపోతే అధికారులు మరియు కాంట్రాక్టర్లు బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు.

ఎడమ కాలువ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నీళ్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అటు వె లిగొండ ప్రాజెక్టుపై పోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Polavaram should be completed